చిరంజీవితో కీర్తి సురేష్!

టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా ముగింపు దశకు వచ్చింది. ఇది పూర్తవ్వగానే చిరంజీవి ఓ నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకొని ఆ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.

మెగాస్టార్ చిరంజీవి … కొరటాల శివ సినిమా కోసం అనేకమంది హీరోయిన్ల పేర్లను పరిశీలించారు. కాగా, ఫైనల్ గా మహానటి హీరోయిన్ కీర్తి సురేష్, మరో నటి శృతి హాసన్ లు నటిస్తున్నారని సమాచారం. జూన్ నుంచి సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది.