HomeTelugu Trendingమైసూర్‌లో 'బంగార్రాజు' టీమ్ సందడి

మైసూర్‌లో ‘బంగార్రాజు’ టీమ్ సందడి

bangarraju movie shooting i

అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, నాగచైతన్య, కృతీశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బంగార్రాజు’ ‘సోగ్గాడు మళ్లీ వచ్చా డు’ అనేది ట్యాగ్‌లైన్. కల్యాణ్‌ కృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్‌ మైసూర్‌లో జరుగుతోంది. నాగచైతన్య, కృతీశెట్టి కాంబినేషన్‌లో వచ్చే లవ్‌ బ్యాక్‌డ్రాప్‌ సీన్స్‌ చిత్రీకరిస్తున్నారని తెలిసింది.

‘బంగార్రాజు’లొకేషన్‌లోని చైతూ, కృతి ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మైసూర్‌ షెడ్యూల్‌ పూర్తికాగానే తర్వాతి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో స్టార్ట్‌ చేస్తారట ‘బంగార్రాజు’అండ్‌ కో. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుందనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. కాగా 2016లో వచ్చిన హిట్‌ మూవీ ‘సోగ్గాడే చిన్నినాయానా’చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu