HomeTelugu Trending'బజార్‌ రౌడీ' ట్రైలర్‌

‘బజార్‌ రౌడీ’ ట్రైలర్‌

Bazaar rowdy trailer

టాలీవుడ్‌ నటుడు సంపూర్ణేశ్‌ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘బజార్‌ రౌడి’. వసంత నాగేశ్వరరావు దర్శకత్వంలో వస్తన్న ఈ సినిమాలో మహేశ్వరి వద్ది హీరోయిన్‌. ఈ చిత్రం ఆగస్టు 20న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ‘ఎనుబోతులని తినే రాబందు కూడా పక్షి జాతే’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఆద్యంతం అలరిస్తోంది. పవర్‌ఫుల్‌ సంభాషణలు, కాలుతో సంపూర్ణేశ్‌ బైక్‌ని లేపే సన్నివేశం ట్రైలర్‌కి హైలెట్‌గా నిలిచాయి. అటు పోరాటాలు, ఇటు రొమాంటిక్‌ సన్నివేశాలతో ఆకట్టుకుంటున్నాడు సంపూర్ణేశ్ బాబు‌. ప్రచార చిత్రాన్ని బట్టి చూస్తుంటే సంపూర్ణేశ్‌ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో షాయాజీ షిండే, కత్తి మహేశ్‌, కరాటే కల్యాణి, షఫి, పృథ్వీరాజ్‌, నాగినీడు తదితరులు నటించారు. సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రానికి యస్‌.యస్‌. ఫ్యాక్టరి సంగీతం అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu