HomeTelugu Trendingకొత్త సినిమా కోసం బెల్లంకొండ న్యూలుక్‌

కొత్త సినిమా కోసం బెల్లంకొండ న్యూలుక్‌

1 28టాలీవుడ్‌ యంగ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం ప్రయత్నిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రాక్షసుడు’ భారీ విజయాన్ని అందుకుంది. ఆ ఉత్సాహంతో మళ్లీ సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు బెల్లంకొండ.

‘కందిరీగ’ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తో ఆయన ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ గుబురు గెడ్డం .. కొత్త హెయిర్ స్టైల్ తో .. సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడు. సిక్స్ ప్యాక్ కోసం జిమ్ లో ఆయన గట్టి కసరత్తులే చేశాడు. రేపు (శుక్రవారం) ఉదయం హైదరాబాద్ – రామానాయుడు స్టూడియోలో ఈ సినిమాను
లాంచ్ చేస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతంను అందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu