HomeTelugu Trendingహీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ తమ్ముడు?

హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ తమ్ముడు?

5 17యువ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ తమ్ముడు సాయి గణేశ్‌ టాలీవుడ్‌కు పరిచయమవుతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్‌ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కబోతోన్న ఓ చిత్రంలో సాయి గణేశ్‌ నటించనున్నట్లు సమాచారం. ప్రేమ కథగా దీన్ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి ఇంకా టైటిల్‌ ఖరారు చేయలేదు. దసరాకు చిత్రం పట్టాలెక్కనున్నట్లు టాలీవుడ్‌ టాక్‌. ‘హుషారు’ నిర్మాత బెక్కం వేణుగోపాల్‌తో కలిసి బెల్లంకొండ సురేశ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ నటించిన ‘రాక్షసుడు’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి విజయం అందుకుంది. తమిళ సినిమా ‘రాచ్చసన్‌’ కు తెలుగు రీమేక్‌ ఇది. ఈ సినిమా తర్వాత తన కుమారుడు శ్రీనివాస్‌తో సినిమా తీయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఇటీవల మీడియా సమావేశంలో బెల్లంకొండ సురేశ్‌ వెల్లడించారు. సరైన దర్శకుడి కోసం చూస్తున్నట్లు చెప్పారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu