HomeTelugu Trendingబాలీవుడ్‌ 'ఛత్రపతి'గా బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌

బాలీవుడ్‌ ‘ఛత్రపతి’గా బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌

Bellamkonda Sai Srinivas in
టాలీవుడ్‌ యంగ్‌హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తాజాగా ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో నటిస్తున్నాడు. అయితే బెల్లంకొండ త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. గతంలో ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఛత్రపతి’ హిట్ చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ రీమేక్ చేస్తోంది. దీనికి సాయిశ్రీనివాస్ ను హీరోగా ఎంచుకుంది. దీనికి బాలీవుడ్ దర్శకుడే దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది.

chatrapathi remake

‘ఛత్రపతి’ కథ యాక్షన్ ఓరియెంటెడ్ ఎమోషన్స్ తో సాగే కథ కాబట్టి ఇది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు బాగా నప్పుతుందని, బాలీవుడ్ లో అతనికి మంచి ఎంట్రీ అవుతుందని అంటున్నారు. ఈ ప్రాజక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి. ఇదిలావుంచితే, ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్‌ సినిమాలు హిందీలో డబ్బింగ్ అయ్యాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu