HomeTelugu Trendingరేపు 'ఛత్రపతి' రీమేక్ స్టార్ట్‌

రేపు ‘ఛత్రపతి’ రీమేక్ స్టార్ట్‌

Rajamouli launch chatrapat
టాలీవుడ్‌లో రాజమౌళి- ప్రభాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఛత్రపతి. 2005లో విడుదలైన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. కాగా ఈ బ్లాక్‌బస్టర్‌ మూవీ హిందీలో రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాని వివి వినాయక్‌ హిందీలో రీమేక్‌ చేస్తున్నాడు.

పెన్‌ స్టూడియోస్‌ బ్యానర్‌లో తెరకెక్కునున్న ఈ మూవీ శుక్రవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమౌళి హజరుకానుండటం విశేషం. ఇక త్వరలోనే రెగ్యూలర్‌ షూటింగ్‌ కూడా ప్రారంభం కానుంది. ఈ మూవీ కోసం శ్రీనివాస్‌ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి మరింత ఫిట్‌గా అయ్యాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu