HomeTelugu Trendingట్రెండింగ్‌లో 'భగవంత్‌ కేసరి' ఫస్ట్‌ సింగిల్‌

ట్రెండింగ్‌లో ‘భగవంత్‌ కేసరి’ ఫస్ట్‌ సింగిల్‌

Bhagavanth Kesari first sin

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని సాహు గారపాటి – హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాకి ఆయన బాణీలు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒక రేంజ్ లో ఉంటాయని బాలయ్య స్వయంగా చెప్పడం విశేషం.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టు సాంగ్‌ ప్రోమోను విడుదల చేశారు. గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో బాలయ్య – ఆయన కూతురు పాత్రను పోషించిన శ్రీలీల .. ఇతర బృందంపై చిత్రీకరించిన పాట ఇది. యూ ట్యూబ్ లో ఈ ప్రోమో ఇప్పుడు నెంబర్ వన్ ట్రెండింగ్ లో నిలిచింది. తెలంగాణ యాసలో బాలయ్య చెప్పే డైలాగ్ తో ఈ పాట మొదలవుతోంది. పూర్తి పాటను రేపు రిలీజ్ చేయనున్నారు.

ఈ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అర్జున్ రాంపాల్ విలన్ పాత్రను పోషించాడు. మరో ముఖ్యమైన పాత్రలో ప్రియాంక జవాల్కర్ అలరించనుంది. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 19వ తేదీన విడుదల చేయనున్నారు. బాలయ్య అభిమానులంతా ఇప్పుడు ఈ సినిమా కోసమే వెయిట్ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu