HomeTelugu Trendingభగవంత్‌ కేసరి రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

భగవంత్‌ కేసరి రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Bhagavath Kesari is all set to release on October 19th

నందమూరి బాలకృష్ణ హీరోగా.. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం ‘భగవంత్ కేసరి’. ఈ సినిమా ని సాహు గారపాటి – హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇది తండ్రీ కూతుళ్ల మధ్య ఉన్న బలమైన ఎమోషన్స్ తో .. బాలయ్య మార్కు యాక్షన్ ప్రధానంగా నడిచే కథ. ఈ సినిమాలో బాలకృష్ణ కూతురిగా శ్రీలీల నటించనుంది.

హీరోయిన్‌గా కాజల్ కనిపించనుంది. బాలయ్య సరసన నటించడం ఆమెకి ఇదే మొదటిసారి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. అక్టోబర్ 19వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ లో, భారీ గన్స్ తో కనిపిస్తున్న బాలయ్య యాక్షన్ లుక్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో ప్రియాంక జవాల్కర్ కీలక పాత్రలో నటిస్తుండగా.. విలన్‌గా అర్జున్ రాంపాల్ తెలుగు తెరకి పరిచయమవుతున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu