HomeTelugu Big Storiesమహేష్‌ తల్లిగా బాలీవుడ్‌ నటి!

మహేష్‌ తల్లిగా బాలీవుడ్‌ నటి!

Bhagya shree key role in Ma
టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఒక్కో పాత్ర గురించి చిత్రబృందం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. పరశురామ్ డైరెక్షన్‌లో ఈ సినిమాలో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. రొమాంటిక్ కామెడీ జానర్లో రూపొందనున్న ఈ సినిమాలో కొన్ని సామాజిక అంశాలు కూడా కీలకం కానున్నాయట. ఇక హీరో బ్యాంకు మేనేజర్ అంటూ.. సినిమా భారీ కుంభకోణం నేపథ్యంలో సాగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

మహేష్ ’27’వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్ న్యూ స్టైల్‌లో అలరించనున్నాడని అర్ధమవుతుంది. ఇప్పటికే రిలీజ్‌ అయిన ఫస్ట్ లుక్.. టైటిల్ కు మంచి టాక్‌ వచ్చింది. కాగా ఈ సినిమాలో మహేష్ బాబు తల్లి పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుందంట. ఆ పాత్ర కోసం పలువురిని పరిశీలించిన బృందం చివరగా బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీని సంప్రదించిందట. మరి మహేష్ బాబుకి తల్లిగా నటించడానికి భాగ్యశ్రీ కూడా సానుకూలంగా తలూపిందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలో నటిస్తోంది. ఈ విషయం పై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu