మెహ్రీన్ తో రవితేజ డేటింగ్!

కృష్ణగాడి వీర ప్రేమ గాధ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలు
దక్కించుకుంటుంది. తాజాగా ఈ హీరోయిన్ తో మాస్ రాజా రవితేజా డేటింగ్ చేస్తున్నాడంటూ ఇండస్ట్రీలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది రెండు సినిమాల్ని ప్లాన్ చేశారు. వీటిలో అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న‘రాజా ది గ్రేట్’ ఇప్పటికే జెట్ స్పీడుతో దూసుకుపోతుంది.

ఇక ఈ సినిమాలో రవితేజ సరసన మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే రవితేజ ఎనర్జీకి ఈ బ్యూటీ తెగ ఫిదా అవుతుంది. మెహ్రీన్ కౌర్ కి రవితేజ బాడీ లాంగ్వేజ్ అంటే బాగా ఇష్టమట. మెహ్రీన్ కౌర్ కి సైతం కొన్ని ఆఫర్స్ రావటం వెనుక‌ రవితేజ తనవంతుగా సహాయం చేస్తున్నాడని అంటున్నారు. ఇండస్ట్రీ లో వినిపిస్తున్న టాక్స్ ప్రకారం మెహ్రీన్ కౌర్ తో రవితేజ డేటింగ్ లో ఉన్నాడని అంటున్నారు. మరి ఈ రిలేషన్ షిప్ ఎన్ని రోజులు సాగుతుందో చూడాలి!