HomeTelugu Trending'భళాతందనాన' ట్రైలర్‌

‘భళాతందనాన’ ట్రైలర్‌

Bhala thandana trailer

టాలీవుడ్‌లో హీరో శ్రీ విష్ణు నటించిన తాజా చిత్రం `భళాతందనాన’. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు చైతన్య దంతులూరి దర్శకత్వం వహిస్తుండగా.. వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. శ్రీవిష్ణు సరసన క్యాథరిన్ థెరిస్సా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే పోస్టర్స్, టీజర్ తో ఆసక్తి రేపిన మేకర్స్ తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిని రేపుతోంది. ‘శశి రేఖ అనే ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్.. ఎన్నో క్రైమ్ స్టోరీలను కవర్ చేస్తూ ఎప్పుడూ ప్రమాదమైన కేసుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇక ఆమెకు తోడుగా హీరో కనిపించాడు. కానీ ఒక హవాలా కేసులో హీరోనే సస్పెక్ట్ గా చూపించారు.

2000 కోట్ల డబ్బు చుట్టూ హీరో పడుతున్నట్లు, మరోపక్క ఆ కేసును సాల్వ్ చేసే దిశగా హీరోయిన్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్లు చూపించారు. ఇక చివర్లో ఆశ డబ్బు కంటే చాలాస్ట్రాంగ్ ఎమోషన్ అని శ్రీ విష్ణు చెప్పిన డైలాగ్ తో కథమొత్తం డబ్బు చుట్టూనే తిరుగుతుందని చెప్పేశారు. మరి చివరకు 2000 కోట్ల డబ్బు ఎవరికి దక్కింది, హీరో నేరాన్ని హీరోయిన్ ఋజువు చేసిందా..? అస్సలు ఆ డబ్బంతా ఎవరిది..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. క్రైమ్..మనీ..ఎమోషన్ చుట్టూ తిరిగే కథగా డైరెక్టర్ ట్రైలర్ కట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాకు మణిశర్మ బీజీఎమ్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. మొత్తానికి ట్రైలర్ తోనే ఆసక్తిని పెంచేశారు మేకర్స్. మరి మే 6 న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకోనున్నదో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!