HomeTelugu Trending'భారత్' సల్మాన్‌ ఖాన్‌ ఫస్ట్‌లుక్‌

‘భారత్’ సల్మాన్‌ ఖాన్‌ ఫస్ట్‌లుక్‌

1 15బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘భారత్’. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. సల్మాన్‌ వృద్ధుడిగా కనిపిస్తున్న ఈ లుక్‌ను చూసి అభిమానులు షాకయ్యారు. సినిమాలో సల్మాన్‌ 20 ఏళ్ల యువకుడి నుంచి 70 ఏళ్ల వృద్ధుడి వరకు వివిధ రకాల లుక్స్‌లో కనిపిస్తారంటూ మొదటినుంచి చిత్రబృందం చెబుతూనే ఉంది. కానీ ఇలాంటి లుక్‌తో ట్విస్ట్‌ ఇస్తారని ఊహించలేదంటూ అభిమానులు సోషల్‌మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.

24న సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఓ దేశం, వ్యక్తి కలిసి చేసే ప్రయాణమే ఈ ‘భారత్’. ఇందులో సల్మాన్‌కు జోడీగా కత్రినా కైఫ్‌ నటిస్తున్నారు. సల్మాన్‌ సోదరి పాత్రలో దిశా పటానీ సందడి చేయనున్నారు. రంజాన్‌ సందర్భంగా జూన్‌ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హిందీలోనే కాకుండా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించినట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu