దళపతి 66 టైటిల్‌ ‘వరిసు’


దళపతి విజయ్‌ ప్రస్తుతం తన 66వ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. జూన్‌ 22న విజయ్‌ బర్త్‌డే కావడంతో ఒక రోజుముందే దళపతి 66 సినిమా టైటిల్‌ను ప్రకటించారు. విజయ్‌- వంశీల కలయికలో వస్తున్న చిత్రానికి వరిసు అన్న టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ‘వరిసు’ అంటూ విజయ్‌ ఫస్ట్‌ లుక్‌ సైతం వదిలారు. ఇందులో హీరో బిజినెస్‌మెన్‌గా కనిపిస్తున్నాడు.

బర్త్‌డే ట్రీట్‌ ఒకరోజు ముందే ఇవ్వడంతో ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో #HBDDearThalapathyVijay, #Thalapathy66FirstLook హ్యాష్‌ట్యాగ్స్‌ తెగ ట్రెండ్‌ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్, యోగి బాబు, ప్రభు, జయసుధ, శ్రీకాంత్, సంగీత, క్రిష్ తదితరులు నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2023 ఆరంభంలో విడుదల కానుంది. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates