HomeTelugu Big Storiesభీమ్లా నాయక్‌- డేనియల్ శేఖర్ ఫొటో వైరల్‌

భీమ్లా నాయక్‌- డేనియల్ శేఖర్ ఫొటో వైరల్‌

Bheemla nayak and daniel sh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘భీమ్లా నాయక్’. సాగర్ కే చంద్ర డైరెక్షన్ల్‌లో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతికి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ దశలో ఉంది. తాజా షెడ్యూల్ లో పవన్, రానాలపై ఫైట్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అందులో భాగంగా భీమ్లా నాయక్, డేనియల్ శేఖర్ లు కలిసి తీసుకున్న పిక్స్ ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

పవన్ మంచంపై పడుకుని ఉండగా, ఆ పక్కనే రానా కూడా ఫొటోలకు ఫోజిచ్చారు. చుట్టూ మార్కెట్ సెట్ ఉండగా, పవన్ షర్ట్ కు రక్తం, గాయమైనట్టుగా ఫొటోలో కన్పిస్తోంది. ఈ పిక్ చూస్తుంటే పవన్, రానా ల మధ్య ఫైట్ సీక్వెన్స్ హైలెట్ అవుతుందని అన్పిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu