HomeTelugu Trendingభోళా శంకర్‌: మేకింగ్‌ స్టిల్స్‌ వైరల్‌

భోళా శంకర్‌: మేకింగ్‌ స్టిల్స్‌ వైరల్‌

Bhola shankar making stills

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్’. వేదాళమ్‌ రీమేక్‌గా వస్తోన్న ఈ చిత్రానికి మెహ‌ర్‌ ర‌మేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా కీర్తిసురేశ్‌ చిరంజీవి సోదరిగా నటిస్తోంది. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది ఈ మూవీ టీం.

ఇందులో భాగంగా మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. చిట్‌ చాట్‌ సెషన్‌ వీడియోలు ఇప్పటికే సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా భోళాశంకర్ మేకింగ్‌ స్టిల్స్‌ను ఏకే ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

చిరంజీవి, డైరెక్టర్ మెహర్‌ రమేశ్‌, సుశాంత్‌, కీర్తిసురేశ్‌ సరదా క్షణాలతోపాటు సాంగ్‌ షూట్‌ లొకేషన్‌లో చిరు, తమన్నా ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.

ఈ మూవీకి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమాలో మురళీ శర్మ, రఘుబాబు, రావు రమేశ్‌, వెన్నెల కిశోర్‌, పీ రవి శంకర్‌, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, రష్మీ గౌతమ్‌, ఉత్తేజ్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!