HomeTelugu Trending'భోళా శంకర్' తాజా షెడ్యూల్‌ ప్రారంభం

‘భోళా శంకర్’ తాజా షెడ్యూల్‌ ప్రారంభం

Bhola shankar shoot begins
మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘భోళా శంకర్’. ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టయినర్ కి మెహర్ రమేశ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలైంది. ఇంతవరకూ 40 శాతం చిత్రీకరణ జరిపారు. తాజా షెడ్యూల్ ను ఈ రోజు నుంచి మొదలుపెడుతున్నారు. ఈ షెడ్యూల్ ను కూడా యాక్షన్స్ సీన్స్ తోనే మొదలుపెడుతున్నారు. చిరంజీవి తదితరులపై ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించనున్నారు. రామ్ – లక్ష్మణ్ నేతృత్వంలో ఈ ఫైట్ సీన్ చిత్రీకరణ జరగనుంది. ఈ సినిమా హైలైట్స్ లో ఈ ఫైట్ హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు.

తమిళంలో ఆ మధ్య భారీ విజయాన్ని నమోదు చేసిన ‘వేదాళం’ సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ కనిపించనుంది. తమన్నా హీరోయిన్‌గా నటించనుంది. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu