HomeTelugu Big Stories'భోళా శంకర్‌' మూవీ అప్డేట్‌

‘భోళా శంకర్‌’ మూవీ అప్డేట్‌

Bhola Shankar Teaser Updaమెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. చిరంజీవి సోదరి పాత్రలో కీర్తిసురేశ్‌ నటిస్తోంది. ఇప్పటికే చిరంజీవి టీం ఏదో ఒక అప్‌డేట్‌తో ఫ్యాన్స్ లో ఆసక్తి నింపుతున్న విషయం తెలిసిందే.

తాజాగా భోళాశంకర్ టీజర్ అప్‌డేట్ అందించారు మేకర్స్‌. ఈ మూవీ టీజర్‌ను జూన్ 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీనితో పాటు చిరు స్టైలిష్‌ లుక్‌తో ఉన్న టీజర్‌ అప్‌డేట్‌ పోస్టర్‌ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. తమిళ బ్లాక్ బస్టర్‌ వేదాళమ్‌ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మెహ‌ర్‌ర‌మేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే హైదరాబాద్‌లో వేసిన స్పెషల్ సెట్‌లో తమన్నా, చిరు, కీర్తిసురేశ్‌తోపాటు ఇతర నటీనటులందరిపై సంగీత్‌ సెర్మనీ నేపథ్యంలో వచ్చే సాంగ్‌ను షూట్‌ చేశారు.

ఈ సినిమాని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌పై అనిల్ సుంకర తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో మురళీ శర్మ, రఘుబాబు, రావు రమేశ్‌, వెన్నెల కిశోర్‌, పీ రవి శంకర్‌, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, రష్మీ గౌతమ్‌, ఉత్తేజ్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 11న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu