HomeTelugu Trendingసలార్ ఓటీటీ హక్కుల కోసం గట్టి పోటీ

సలార్ ఓటీటీ హక్కుల కోసం గట్టి పోటీ

Big competition for salaar

పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం సలార్‌ గురించి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 28వ తేదీన థియేటర్లకు రావలసిన ఈ సినిమా, కొన్ని కారణాల వలన వాయిదా పడింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని హోంబలే ఫిలింస్ నిర్మిస్తోంది.

సలార్ మూవీ ఓటీటీ హక్కులకు సంబంధించిన వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీ లివ్, నెట్ ఫ్లిక్స్ పోటీపడినట్టు తెలుస్తోంది. చివరికి స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ చేజిక్కించుకున్నట్టు సమాచారం. ఓటీటీ హక్కుల కోసం నెట్ ఫ్లిక్స్ రూ.185 కోట్లను చెల్లించినట్టు తెలుస్తోంది.

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న మూవీ.. హోంబలే బ్యానర్ కావటంతో ఓటీటీ హక్కుల కోసం పోటీ ఎక్కువైంది. సలార్ మూవీ ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ మూవీలో శ్రుతి హాసన్ హీరోయిన్ కాగా, జగపతిబాబు, పృథ్వీ రాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu