Mahesh Babu in SSMB29 Movie Launch:
తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న మహేష్ బాబు, ఎస్‌ఎస్ రాజమౌళి కలయికలో రూపొందనున్న చిత్రం జనవరి 2, 2025న హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో గ్రాండ్ లాంచ్ జరిగింది. ప్రాజెక్ట్‌కు ఇప్పటివరకు SSMB29 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ సినిమా ప్రారంభం పెద్ద ఎత్తున జరిగినా, ఈవెంట్ సింపుల్‌గా సాగింది.
మహేష్ బాబు తన విలాసవంతమైన గోల్డ్ కలర్ రేంజ్ రోవర్ SV (ధర రూ. 5.4 కోట్లు)లో ఈ కార్యక్రమానికి హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ కారును ఆయన 2023లో కొనుగోలు చేశారు. ఈవెంట్ ఒక ఎత్తు అయితే మహేష్ కార్ ఇంకా ప్రత్యేకంగా నిలిచింది అని చెప్పుకోవచ్చు.
రాజమౌళి పేరు వినగానే అందరికీ భారీ విజువల్స్, కొత్త కథలపై నమ్మకం కలుగుతుంది. ఈ సినిమా గురించి అక్టోబర్ 2024లో రాజమౌళి ఇచ్చిన లొకేషన్ స్కౌటింగ్ అప్డేట్స్ మరింత ఉత్కంఠ కలిగించాయి. ఆఫ్రికా అందమైన అడవి ప్రాంతాల్లో చిత్రీకరణ జరగనుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ సినిమా గ్లోబల్ అడ్వెంచర్‌గా ఉంటుందని టాక్ నడుస్తోంది.
మహేష్ బాబు ఈ చిత్రంలో హనుమాన్ పాత్రకు స్పూర్తిగా తయారవుతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే తన పాత్ర ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం ప్రత్యేకంగా శ్రమిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్లాన్ చేశారు. మొదటి భాగం 2025 ఏప్రిల్‌లో షూటింగ్ ప్రారంభమై, 2027లో విడుదల కానుంది. రెండవ భాగం 2029లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ALSO READ: Game Changer ఫస్ట్ రివ్యూ వచ్చేసిందోచ్.. సినిమా ఎలా ఉందంటే!