HomeTelugu Big Storiesబిగ్‌బాస్-3 తెలుగు 37వ ఎపిసోడ్(ఆగస్ట్ 26) హైలైట్స్

బిగ్‌బాస్-3 తెలుగు 37వ ఎపిసోడ్(ఆగస్ట్ 26) హైలైట్స్

15 4
తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లో ఈవారం అసలు మజా మొదలైంది. ఈరోజు(ఆగస్ట్ 26) 37వ ఎపిసోడ్ జరిగింది. ఇప్పటివరకు హౌస్‌లోని 16 మంది సభ్యుల్లో ఐదుగురు ఒక్కొక్కరుగా ఎలిమినేట్ కావడంతో ఇక బిగ్‌బాస్ హౌస్‌లో 11 మంది మిగిలారు. ఈవారం ఎలిమినేషన్‌కు నామినేషన్ ప్రక్రియ నేటి ఎపిసోడ్‌తో ప్రారంభం అయింది. ఇవాళ్టి ఎపిసోడ్‌లోని హైలైట్స్ ఏమిటంటే… బిగ్‌బాస్ న్యూస్‌ పేపర్‌.. హౌస్‌లో ఈవారం జరిగిన వాటిపై బిగ్‌బాస్ వీక్లీ పేపర్ పంపించాడు. ఇందులో పునర్నవి లవ్ ట్రాక్.. బాబా భాస్కర్ వంట.. అలీ కండలపై ఫన్నీ వార్తలను విడుదల చేశాడు. వాటిని చదివిన ఇంటి సభ్యులు ఎంజాయ్‌ చేశారు.

తర్వాత ఎలిమినేషన్‌కు నామినేషన్ పక్రియ ప్రారంభమైంది. శివజ్యోతి తప్ప మిగిలిన వారిని జంటలుగా నిలబడమన్నాడు బిగ్‌బాస్. అందుకోసం 1.వరుణ్‌-పునర్నవి, 2. రవి-అలీ, 3. బాబా-మహేష్, 4. శ్రీముఖి-హిమజ, 5. వితిక-రాహుల్‌ జంటలుగా విడిపోయారు. ఈ జంటల్లో ఎవరిని ఎక్కువ మంది సభ్యులు ఎలిమినేట్‌ చేయాలనుకుంటారో చెప్పమన్నాడు. ఈ ప్రక్రియలో ముందుగా పునర్నవి-వరుణ్‌ జంట నిలబడ్డారు. వారిపై ఇంటి సభ్యులు తమ అభిప్రాయాలు చెప్పారు.

హౌస్‌లోని సభ్యులకు ఈ క్రింది విధంగా ఓట్లు వచ్చాయి

1) వరుణ్‌ (3) పునర్నవి(5) .
2) రవి (7) అలీకి(1)
3) బాబా(2) మహేష్‌(6)
4) హిమజ(7) శ్రీముఖి(1)
5) రాహుల్‌(5), వితిక(4) శివజ్యోతి రాహుల్‌ని నామినేట్‌ చేసింది

అయితే శివజ్యోతికి బిగ్‌బాస్‌ ఓ పవర్‌ ఇచ్చాడు.. నామినేషన్‌ నుంచి సేవ్‌ అయిన సభ్యుల్లో నేరుగా ఒకరిని ఎలిమినేట్‌ చేయవచ్చన్నాడు. అలీ, బాబా, శ్రీముఖి, వితికలను సేవ్‌ చేసి వరుణ్‌ ని నేరుగా నామినేట్‌ చేసింది. దాంతో ఈ వారం వరుణ్‌, రవి, పునర్నవి, మహేష్‌, హిమజ, రాహుల్‌ ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే మహేష్‌, వితిక, వరుణ్‌లు ఎలిమినేషన్‌ ప్రక్రియ గురించి చర్చించుకున్నారు. ఈ చర్చలో పునర్నవి కూడా ఎంటర్‌ అయ్యింది. ఆ తరువాత వితిక, వరుణ్ లు చర్చించుకున్నారు. రేపటి ఎపిసోడ్‌ మరింత ఎగ్జయిటింగ్‌గా ఉండబోతుందని బిగ్‌బాస్‌ సెలవు తీసుకున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu