కామెడీ కాదు సీరియస్‌.. బాబాపై నాగార్జున సీరియస్‌

శని, ఆదివారల్లో.. హౌస్‌మేట్స్‌ను అల్లరించేందుకు, దారిలో పెట్టేందుకు మన్మధుడు సిద్ధం అయ్యాడు. బిగ్‌బాస్‌ ఐదో వారంలో హౌస్‌మేట్స్‌ ప్రవర్తనపై కొందరికి అక్షింతలు పడేట్టు కనిపిస్తున్నాయి. ఓ వారం పొగడ్తలు, మరోవారం అక్షింతలతో అలీరెజా నెట్టుకొస్తున్నాడు. అయితే ఈ వారం నాగర్జున అలీకి గట్టిగానే క్లాస్‌ పీకుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వారం మహేష్‌తో వాగ్వాదానికి దిగడం, కెప్టెన్‌ శివజ్యోతి చెబుతున్నా వెనక్కి తగ్గకపోవడంపై నాగార్జున గురిపెట్టినట్టు కనిపిస్తోంది.

నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను కాసేపటి క్రితమే విడుదల చేశారు. అలీరెజా, బాబా భాస్కర్‌ల తీరును నాగార్జున ఎత్తిచూపుతున్నాడు. అంత అహంకారమెందుకు? ఆడపిల్ల కెప్టెన్‌ అయితే మాట వినవా? అంటూ అలీరెజాను ప్రశ్నిస్తున్నాడు? ఇక బాబా భాస్కర్‌ విషయాన్ని కూడా నాగ్‌ లేవనెత్తగా.. కామెడీగా చేసేందుకు ప్రయత్నించిన బాబాను ఉద్దేశించి.. ఇది కామెడీ కాదు సీరియస్‌ అంటూ కాస్త ఘాటుగా స్పందించాడు నాగ్‌. మిగిలిన ఇంటి సభ్యులకు కూడా క్లాస్‌ పీకాడా అని తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఎదురుచూడాలి