HomeTelugu Trendingమై ఫేవరేట్ బాయ్స్.. యశ్‌ భార్య రాధికా ట్వీట్‌

మై ఫేవరేట్ బాయ్స్.. యశ్‌ భార్య రాధికా ట్వీట్‌

9 24
కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు కన్నడ హీరో యశ్. ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్ -2లో నటిస్తున్నాడు యశ్. ఈయన కన్నడ హీరోయిన్ రాధికా పండిట్ ను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు కూతురు ఐరా, ఓ కొడుకు ఉన్నారు. 2019న వీరికి కుమారుడు జన్మించాడు. ఇటీవలే తన కొడుకు ఫోటోను అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు యశ్ . తాజాగా యశ్ సతీమణి రాధికా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా యశ్‌, అతని కొడుకు ఫోటోలని షేర్ చేసింది. ఇందులో ఇద్దరు షర్ట్ లేకుండా క్యూట్ స్మైల్‌తో కనిపిస్తున్నారు. మై ఫేవరేట్ బాయ్స్ అంటూ రాధికా పండిట్ షేర్ చేసిన ఫోటో అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu