HomeTelugu Big Storiesశ్రీముఖి ఈ హౌస్‌కు నువ్వు బాస్‌ కాదు.. స్టేజ్‌పైనే షూ పాలిష్‌ చేసిన నాగ్‌

శ్రీముఖి ఈ హౌస్‌కు నువ్వు బాస్‌ కాదు.. స్టేజ్‌పైనే షూ పాలిష్‌ చేసిన నాగ్‌

13 7

తెలుగు బిగ్‌బాస్‌.. ఈ వారంలో బిగ్‌బాస్‌ ఇచ్చిన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం టాస్క్‌ ఒకెత్తు అయితే.. దానిని సరిగా అర్థం చేసుకోకుండా ఇంటి సభ్యులు ఆడిన విధానం మరో ఎత్తు. ఈ టాస్క్‌లో జరిగిన పరిణామాలు.. పునర్నవి ప్రవర్తించిన తీరు… ఆ పై టాస్క్‌ను నిందించడం.. టాస్క్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌ను ఎదిరించడం.. లాంటివి చాలానే జరిగాయి. అయితే వీటన్నంటిపై నాగార్జున సీరియస్‌ అయినట్లు కనిపిస్తోంది.

బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌ను బుల్‌షిట్‌ అని అంటావా? అంటూ పునర్నవిపై నాగార్జున ఫైర్‌ అయ్యాడు. కూసే గాడిదొచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్టుందని శ్రీముఖిపై సీరియస్‌ అయ్యాడు. అంతేకాకుండా శ్రీముఖిని ఉద్దేశిస్తూ.. నువ్వు ఈ హౌస్‌కు బాస్‌వి కాదు.. ఈ హౌస్‌కు బిగ్‌బాస్‌ బాస్‌ అంటూ ఘాటుగా స్పందించాడు. ఇక నాగ్‌ జోరు చూస్తుంటే.. హౌస్‌మేట్స్‌ అందరికీ తడిసిపోయేట్టు కనిపిస్తోంది. మరి నేటి ఎపిసోడ్‌ మొత్తం సీరియస్‌గా సాగుతుందా? లేదా ఏదైనా ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉందా? అన్నది కాసేపట్లో తేలనుంది. స్టేజ్‌ పైనే షూ పాలిష్‌చేసిన నాగ్‌.. గేట్లు తెరిచే ఉన్నాయి బయటకు వెళ్లు అంటూ మహేష్‌కు వార్నింగ్‌ ఇచ్చాడు. మరి తరువాత ఏం జరిగిందన్నది తెలియాలంటే షో ప్రసారమయ్యే వరకు ఆగాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu