HomeTelugu Trendingహౌస్‌మేట్స్‌ పై పీకలదాక కోపంతో ఉన్న నాగ్‌.. వీడియో

హౌస్‌మేట్స్‌ పై పీకలదాక కోపంతో ఉన్న నాగ్‌.. వీడియో

10 8శని, ఆదివారాలు వచ్చాయి అంటే బిగ్‌బాస్‌లో నాగార్జున సందడి చేస్తారు. తాజాగా విడుదల చేసిన ప్రోమోను బట్టి నాగ్‌.. బాగానే సీరియస్‌గా ఉన్నట్లు కనిపిస్తోంది. డ్యాన్సర్లను కూడా డ్యాన్స్‌ చేయొద్దని పంపిస్తూ.. పీకలదాక కోపం ఉంది.. ముందు హౌస్‌మేట్స్‌తో మాట్లాడాలి అంటూ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ వారంలో ఇంట్లో కొందరు ఇంటిసభ్యులు తిరుగుబాటు చేశారు. బిగ్‌బాస్‌ ఆదేశాలనే ధిక్కరించారు. ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం అనే టాస్క్‌లో పునర్నవి, మహేష్‌, శ్రీముఖిలు చెత్త పర్ఫామెన్స్‌ ఇచ్చిన కారణంగా.. వారికి పనిష్మెంట్‌ను ఇచ్చే క్రమంలో షూ పాలిష్‌ చేయాలనే టాస్క్‌ను ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిని మహేష్‌, పునర్నవిలు వ్యతిరేకించారు. చివరకు శివజ్యోతి సముదాయించడంతో మహేష్‌ దిగివచ్చాడు. అయితే పునర్నవి మాత్రం ఇంకా బెట్టు చేస్తూనే ఉండటం.. ఆఖరికి వరుణ్‌ సందేశ్‌ బతిమిలాడటంతో షూలను పాలిష్‌ చేసింది. అయినా సరే తనకు ఈ టాస్క్‌లు నచ్చలేదని బిగ్‌బాస్‌ను వేలెత్తి చూపించింది. అయితే వీటన్నంటిపై నాగార్జున సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది. మరి నాగ్‌ ఎవరెవరికి ఎటువంటి క్లాస్‌ ఇస్తాడో చూడాలి మరి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu