HomeTelugu Big Storiesబిగ్‌బాస్‌: 'ఏయ్.. ఆపేయ్'.. సిగ్గులేదురా.. రవికృష్ణపై తమన్నా ఫైర్‌

బిగ్‌బాస్‌: ‘ఏయ్.. ఆపేయ్’.. సిగ్గులేదురా.. రవికృష్ణపై తమన్నా ఫైర్‌

8 4అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్-3 ప్రస్తుతానికి ఎలాంటి వివాదాలు లేకుండా చాలా సాఫీగా సాగిపోతోంది. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఈ షోలో ఇప్పటి వరకు చిన్న చిన్న గొడవలు తప్ప పెద్దగా వివాదాలు ఏమీ జరగలేదు. కాకపోతే హౌస్‌లో రెండు గ్రూపులున్నాయని మాత్రం రెండోవారం ఎలిమినేట్ అయిన జాఫర్.. నాగార్జునకు వెల్లడించారు. ప్రతివారం మాదిరిగానే మూడో వారం మొదటిరోజు మళ్లీ నామినేషన్ ప్రక్రియ మొదలుకాబోతోంది.

ఆదివారం నాటి ఎలిమినేషన్ ఎపిసోడ్ అయిపోయిన తరవాత చూపించిన ప్రోమో చూస్తే ఈసారి నామినేషన్ ప్రక్రియ కాస్త విభిన్నంగా జరగనున్నట్టు అర్థమవుతోంది. ప్రతి ఇంటి సభ్యుడు తాను నామినేట్ చేసే వ్యక్తి ముఖంపై స్టాంపులతో ముద్రలు వేస్తున్నారు. ఈ ప్రక్రియ కాస్త వివాదం అయినట్టు స్టార్ మా తాజాగా ట్వీట్ చేసిన ప్రోమోను చూస్తే అర్థమవుతోంది. ఈ వివాదానికి కారణం తమన్నా సింహాద్రి.

రవికృష్ణ చాలా మంచోడని, అందరితో చాలా మంచిగా ఉంటాడని తమన్నా ఇప్పటికే చెప్పారు. అయితే, ఈ వారం ఎలిమినేషన్‌కు తమన్నాను రవికృష్ణ నామినేట్ చేశారు. దీనికి కారణం కూడా చెప్పారు. ‘ఒక మిస్టేక్ చేసి మళ్లీ వెంటనే రియలైజ్ అయ్యి వెంటనే సారీ చెబుతారు’ అని రవికృష్ణ చెబుతుండగానే తమన్నా ‘ఏయ్.. ఆపేయ్’ అంటూ అడ్డుపడ్డారు. ‘సిగ్గులేదురా. తు.. నన్ను నేను ఊసుకోవాలి ఇలాంటోడికి నేను సపోర్ట్ చేసినందుకు’ అని కాస్త కఠువుగా మాట్లాడారు.

దీంతో వెంటనే తమన్నాకు శ్రీముఖి అడ్డుపడ్డారు. ‘ఇన్ని అన్నావు ఆయన సైలెంట్‌గా ఉన్నాడు. ఆయన మనస్తత్వం అది’ అని శ్రీముఖి అనగానే.. ‘నువ్వు నాకు చెప్పకు’ అంటూ తమన్నా కౌంటర్ ఇచ్చారు. ‘నీ ఇష్టమొచ్చినట్టు చేసుకో’ అంటూ శ్రీముఖి కోపంగా అన్నారు. ఇదంతా తాజా ప్రోమోలో చూపించిన చిత్రం. ఈ గొడవేమిటో చూడాలంటే ఈరోజు రాత్రి 9.30 వరకు ఆగాల్సిందే!

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu