ముస్తాబవుతున్న ‘మేడమీద అబ్బాయి’!

కామెడీ చిత్రాల కథానాయకుడు అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘మేడమీద అబ్బాయి’. జాహ్నవి ఫిల్మ్స్ పతాకంపై బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. నిఖిల విమల్ కథానాయిక. మలయాళంలో ఘనవిజయం సాధించిన ఒరు వడక్కం సెల్ఫీ చిత్రానికి రీమేక్ ఇది. మాతృకకు దర్శకుడైన జి.ప్రజిత్ తెలుగు రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.
ఈ సందర్భంగా.. నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ.. ”పొలాచ్చిలో జరిగిన భారీ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్‌లో జరుగుతున్న మరో షెడ్యూల్ ఇది. ఇప్పటి వరకు జరిగిన చిత్రీకరణతో 90శాతం షూటింగ్ పూర్తయింది. బ్యాలెన్స్ పాటను త్వరలోనే పూర్తి చేసి జూన్ చివరివారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. గమ్యం, శంభో శివ శంభో తర్వాత అలాంటి శక్తివంతమైన కథతో నరేష్ చేస్తున్న చిత్రమిది. రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో స్క్రీన్‌ప్లే హైలైట్‌గా వుంటుంది. థ్రిల్లింగ్ అంశాలు వుంటూనే నరేష్ శైలి వినోదం వుంటుంది. నరేష్‌ను కొత్త కథలో చూడాలనుకునే వారికి ఈ సినిమాతో ఆ లోటు తీరిపోతుంది” అని తెలిపారు.