HomeTelugu Trendingఇంటి సభ్యుల మధ్య మంటపెట్టిన బిగ్‌బాస్‌..

ఇంటి సభ్యుల మధ్య మంటపెట్టిన బిగ్‌బాస్‌..

Bigg boss 3rd week eliminat
తెలుగు బిగ్‌బాస్‌‌-4 మూడో వారంలోకి అడుగుపెట్టింది. ఈరోజు సోమవారం నామినేషన్‌ ప్రక్రియ మొదలైంది. అయితే గత వారం నామినేషన్‌ చాలా సులువుగా త్యాగాలు చేస్తూ జరిగిందని నాగార్జున ఇంటిసభ్యులపై మండిపడ్డాడు. దీంతో ఈ వారం నామినేషన్‌ మిగతా వాటితో పోలిస్తే చాలా వేడిగా ఉన్నట్లు కన్పిస్తోంది. ఈ వారం ఎవరిని నామినేషన్‌లో ఉంచాలో వారి ఫోటోలను మండుతున్న అగ్నిలో వేయాల్సి ఉంటుంది. అలాగే వారిని నామినేట్‌ చేయడానికి గల కారణాలను కూడా తెలియజేయాలి. కాగా ఈ నామినేషన్‌ ప్రక్రియపై శనివారం జరిగిన హీరో, జీరో టాస్క్‌ ఎఫెక్ట్‌ బాగా పనిచేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు స్నేహితులుగా ఉన్న వారు ఈ ఎపిసోడ్‌తో ఒక్కసారిగా శత్రువులుగా మారబోతున్నారు. ఈ క్రమంలో ఇస్మార్ట్‌ సోహైల్‌ తన స్నేహితురాలు అరియానా గ్లోరీ ఫొటోను మంటల్లో వేయగా.. బదులుగా అరియానా.. సోహైల్‌ ఫోటోను మంటల్లో ఆహుతి చేసింది. వీరిద్దరి మధ్య మాటల యుద్దం జరిగినట్లు కనిపిస్తుంది. ఇక దేవి- అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ ఫోటోను మంటల్లో తగలబెట్టింది. ఇక పూర్తి నామినేషన్‌ ఎలా జరగబోతుంది. ఎవరూ ఈ వారం నామినేషన్‌లో ఉండబోతున్నారో తెలుసుకోవాలంటే ఈ రోజు ప్రసారమయ్యే బిగ్‌బాస్‌ చూసే వరకు ఆగాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu