HomeTelugu Trendingఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమేనా!

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమేనా!

Bigg Boss 4 second eliminat
తెలుగు బిగ్‌బాస్ -4 రెండో వారం పూర్తి కానుంది. మరికొన్ని గంటల్లో ఎలిమినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే సూర్య‌కిర‌ణ్ హౌస్‌కు గుడ్‌బై చెప్పిన విష‌యం తెలిసిందే. అయితే అత‌డి ఎలిమినేష‌న్‌ను అందరూ ముందుగానే ఊహిస్తూ వచ్చారు. ఇక రెండో వారానికి వ‌చ్చేస‌రికి మాత్రం ఎవ‌రు వెళ్లిపోతార‌నేది ఆసక్తికరంగా మారింది. పైగా ఈ వారం డ‌బుల్ ఎలిమినేష‌న్ కూడా ఉండొచ్చ‌న్న టాక్‌ కూడా ఉంది. అయితే ఈ వారానికి గానూ అభిజిత్‌, గంగ‌వ్వ‌, నోయ‌ల్‌, హారిక‌, అమ్మ రాజ‌శేఖ‌ర్‌, సోహైల్‌, క‌ళ్యాణి, కుమార్ సాయి, మోనాల్ ఇలా తొమ్మిది మంది ఇంటి స‌భ్యులు నామినేట్ అయ్యారు.

వీరిలో గంగ‌వ్వకు అంద‌రిక‌న్నా ఎక్కువ మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. దీంతో ఆమె బ‌య‌ట‌కు వెళ్లే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఈ మధ్య ఆమె ఆరోగ్యం బాగోలేక‌పోవ‌డంతో బిగ్‌బాస్ బ‌య‌ట‌కు పంపిస్తాడ‌ని వార్త‌లు వినిపించాయి. అయితే ఇప్పుడప్పుడే అలాంటి నిర్ణ‌యం తీసుకునేట‌ట్లు క‌నిపించ‌డం లేదు. మ‌రోవైపు ఆమె ఆరోగ్యంపై స్పందించిన గంగ‌వ్వ టీం ఆమె మంచిగ‌నే ఉంద‌ని, టెన్ష‌న్ ప‌డకుర్రి అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ వారం గంగ‌వ్వ బ‌య‌ట‌కు రాద‌ని తేలిపోయింది.

gangavva

నోయ‌ల్ కూడా సేఫ్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అభిజిత్‌, సోహైల్‌, మోనాల్‌, హారిక కూడా ఈ వారం కూడా సేఫ్ అయినట్లు తెలుస్తోంది. వీరి త‌ర్వాత స్థానంలో త‌క్కువ ఓట్లు సంపాదించుకున్న‌ అమ్మ రాజ‌శేఖ‌ర్ ఉన్నాడు. కారటే క‌ళ్యాణి డేంజ‌ర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయి హౌస్‌లో ఉన్నాడా? లేడా? అన్న‌ట్టుగా ఉంది. అత‌డికి కూడా త‌క్కువ ఓట్లే ప‌డ్డ‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి క‌ళ్యాణి, అమ్మ రాజ‌శేఖ‌ర్‌, కుమార్ సాయి డేంజ‌ర్ జోన్‌లో ఉన్నారు. అయితే క‌ళ్యాణి, అమ్మ రాజ‌శేఖ‌ర్‌లో ఎవ‌రు వెళ్లిపోయినా ఎంటర్‌టైన్‌మెంట్‌కు గండి ప‌డుతుంద‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. దీంతో మాస్ట‌ర్‌కు హౌస్‌లో కొన‌సాగేందుకు ఛాన్సిచ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. క‌ళ్యాణిని ఎలిమినేట్‌ అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu