HomeTelugu Trending'విడుదల' ట్రైలర్‌

‘విడుదల’ ట్రైలర్‌

Vidudhala Part1 Trailer
వెట్రిమారన్ డైరెక్షన్‌లో వస్తున్న విజయ్‌ సేతుపతి- సూరి ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం ‘విడుదల: పార్టు-1’. ఇప్పటికే ‘విడుదలై-1’ పేరుతో తమిళంలో రిలీజ్‌ అయింది. త్వరలో ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

కమెడియన్ గా సక్సెస్ అయిన సూరి ఈ సినిమాలో సీరియస్ రోల్ లో కానిస్టేబుల్ గా కనిపించాడు. తమిళంలో హిట్ అయిన ఈ సినిమాని గీతా ఫిలిమ్స్ లో అల్లు అరవింద్ తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ప్రజాదళం అనే నక్సలైట్ గ్రూప్ పోలీసులకి మధ్య జరిగే ఆధిపత్య పోరుగా ఈ మూవీని ఆవిష్కరించారు.
ఈ గ్రూప్ ని పెరుమాళ్ మాస్టర్ అనే వ్యక్తి నడిపిస్తూ ఉంటాడు. ప్రభుత్వానికి ప్రతిబంధకంగా ఉన్న వారిని ఏరివేయడానికి ఒక పోలీస్ యాక్షన్ టీమ్ ని రంగంలోకి దించుతారు. అందులో సూరి కానిస్టేబుల్ గా ఉంటాడు.

అయితే తాను కూడా ఈ కూంబింగ్ ఆపరేషన్ లో పాల్గొనడానికి పై అధికారులు అవకాశం ఇవ్వరు. అతనితో అన్ని రకాల పనులు చేయించడంతో పాటు డ్రైవర్ గా ఉపయోగించకుంటారు. కూంబింగ్ ఆపరేషన్ లో పాల్గొనాలని అతను అనుకుంటాడు. ఒక ప్రజా దళం హెడ్ గా విజయ్ సేతుపతిని రిప్రజెంట్ చేశారు. అతనిని పట్టుకోవడానికి ఆపరేషన్ ఘోస్ట్ హంట్ పేరుతో కూంబింగ్ స్టార్ట్ చేశారు. ఇక ప్రజాదళం లీడర్ ని పట్టుకోవడానికి మహిళలని పోలీసులు చిత్రహింసలు పెడతారు. దానిని సూరి ప్రతిఘటిస్తాడు.

ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగింది. తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎంత వరకు ఆదరిస్తారో చూడాలి.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu