HomeTelugu Big Storiesబిగ్‌బాస్-4 తెలుగు (12సెప్టెంబర్ 2020) హైలైట్స్

బిగ్‌బాస్-4 తెలుగు (12సెప్టెంబర్ 2020) హైలైట్స్

Bigg Boss 4 Telugu 12th sep
తెలుగు బిగ్‌బాస్‌-4 ప్రారంభమై వారం రోజులు అవుతోంది. శని, ఆదివారాల్లో బిగ్‌బాస్‌లో హోస్ట్‌ నాగార్జున సందడి చేస్తాడు. బిగ్ బాస్ వేదికపైకి వచ్చిన నాగార్జున హౌజ్‌లో ఐదో రోజు ఏం జరిగిందో మన టీవీ ద్వారా చూపించారు. కాసేపు ఐదో రోజు జరిగిన సంఘటనలు చూపించిన నాగార్జున.. ఆ తరవాత 16 మంది హౌస్‌మేట్స్‌తో మన టీవీ ద్వారా మాట్లాడారు. అందరినీ పేరుపేరున పలకరించారు. గంగవ్వ ఫాస్ట్‌‌గా మాట్లడుతున్నావ్‌.. ప్రేక్షకులకు అర్థం కావడం లేదు కొంచెం స్లోగా మాట్లాడు అన్నాడు నాగ్‌. నోయల్‌ నువ్వు ఓవర్‌గా ఆలోచిస్తున్నావ్‌ అన్నాడు. అరియానా ఎందుకు అరుస్తున్నావ్‌ అందరి అన్నాడు. అఖీల్‌ నీకంటే.. సోహల్‌ బస్కీలు బాగా తీస్తాడు. అని సోహైల్ మీద అరియానాను కూర్చోబెట్టి తీయించారు. అఖిల్‌ ఇంటిలో అందరు నిను బాగా ఇష్టపడతారు అన్నాడు. మోనాల్ గుజ్జార్ ప్రతిదానికీ ఎమోషనల్ అవ్వడంపై నాగార్జున సరదాగా సెటైర్లు వేశారు. మోనాల్ ఏడుపు నర్మదా నదితో పొల్చాడు. యాంకర్ లాస్య గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తోందని నాగార్జున చురకంటించారు. అభిజిత్‌ ని కోపం తగ్గించుకోవాలని నాగ్‌ సూచించారు. దేత్తడి హారికతో తాను చాలా బాగా కనెక్ట్ అయ్యానని అభిజిత్ చెప్పాడు. తాను కూడా కనెక్ట్ అయ్యానని హారిక అన్నది. తరువాత బ్రేక్‌ తిసుకున్నాడు నాగ్‌. ఈ బ్రేక్‌లో నోయల్ ఆధ్వర్యంలో ఒక ర్యాప్ సాంగ్‌ను సిద్ధం చేశారు ఇంటి సభ్యులు. ‘కట్టప్ప ఎవరో చెప్పండి సార్’ అంటూ చేసిన ఈ ర్యాప్ సాంగ్ బాగుంది.

పరిశుభ్రత కోసం అడిగిన మోనాల్‌పై అమ్మ రాజశేఖర్‌ అరవడాన్ని నాగార్జున ప్రశ్నించారు. ఆ తప్పును తాను సరిదిద్దుకుంటానని రాజశేఖర్ హామీ ఇచ్చారు. ‘‘దేవుడు ఇచ్చిన అవయవాలను అతిగా వాడేస్తే పోతాయి’’ అంటూ సూర్యకిరణ్ గొంతు గురించి సెటైర్ వేశాడు నాగ్‌. హౌస్‌మేట్స్ అందరిపై సూర్యకిరణ్ అరవడంపై నాగార్జున ప్రశ్నించారు.

కరాటే కళ్యాణి అక్కడిది ఇక్కడ.. అక్కడిది ఇక్కడ చెప్పడం కూడా కరెక్ట్ కాదు అని నాగార్జున సూచించారు. ‘‘కళ్యాణి నువ్వు చాలా ఎక్కువ ఆలోచించి ఫీలైపోతున్నావ్. అనవసరంగా ఫీలవుతున్నావు. వేరే వాళ్లు మాట్లాడుతుంటే వాళ్లను మాట్లాడనివ్వవు. వాళ్లను మాట్లాడనివ్వవు.. మీద ఎక్కేస్తావ్’’ అని సున్నితంగా క్లాస్ పీకారు నాగార్జున.

ఇక నైబర్ హౌస్‌ నుంచి వచ్చిన సోహైల్, అరియానాతో చిన్న సరదా గేమ్ ఆడించాడు నాగార్జున. స్టోర్ రూంలో నుంచి మెడల్స్‌ను తీసుకొచ్చి దానిపై రాసి ఉన్న విధంగా ఒక్కో హౌస్‌మేట్ మెడలో వేయాలని సూచించారు. అలా, సోహైల్-అరియానా వేసి మెడల్స్-కంటెస్టెంట్స్ వివరాలు ఇలా ఉన్నాయి..

ఊసరవెల్లి – జోర్దార్ సుజాత, చేదు – దివి, రొమాంటిక్ – అఖిల్, చిచ్చు పెట్టడం – కరాటే కళ్యాణి, డ్రామా క్వీన్ – దేత్తడి హారిక, బద్దకం – సూర్యకిరణ్, చెత్త కుండీ – అభిజిత్, లౌడ్ స్పీకర్ – నోయల్, తోపు – గంగవ్వ, పర్ఫెక్ట్ – దేవి, క్రై బేబీ – మోనాల్, బకరా – లాస్య, మిర్చి – మెహబూబ్, జోకర్ – అమ్మ రాజశేఖర్ ఇచ్చారు. ఇక హౌస్ లో కట్టప్ప ఎవరూ లేరు అని నాగ్‌ తేల్చేశాడు. పైగా కట్టప్పగా ఎక్కువ ఓట్లు వచ్చిన లాస్యను బిగ్‌బాస్‌-4 ఫస్ట్‌ కెఫ్టెన్‌గా‌ చేశాడు. ఇక మొదటి వారం నామినేట్‌ అయిన వారిలో ఫస్ట్‌ అభిజిత్‌, సూజాత, గంగవ్వ సేవ్‌ అయ్యారు. ఇక రేపటి ఎపిసోడ్‌లో ఎవరు ఎలిమినేట్‌ అవుతారో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu