నవ్వుతూనే వర్మకి వార్నింగ్ ఇచ్చారట!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ‘వంగవీటి’ సినిమా రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఈరోజు విజయవాడలో జరగనుంది. అయితే దానికంటే ముందుగా వర్మ, వంగవీటి కుటుంబ సభ్యులు వంగవీటి రాధాకృష్ణ, అతడి తల్లి రత్నకుమారిలతో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం వర్మ మీడియాకు చిక్కలేదు. కానీ మీటింగ్ లో జరిగిన విషయాలను తన ట్విటర్ ద్వారా తెలిపారు. ”’మీటింగ్ సజావుగా సాగలేదు..

నేను జీవితంలో ఇప్పటివరకు చాలా సీరియస్ వార్నింగ్ లు చూశాను. కానీ మొదటిసారి నవ్వుతూ.. సీరియస్ వార్నింగ్ ఇచ్చేవాళ్లను చూశాను. అయినా వంగవీటి సినిమా విషయంలో నేను వెనక్కి తగ్గను. ఏమవుతుందో.. చూడాలి. ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు ఇబ్బంది పెడుతున్నారు. 

కానీ రాధారంగా మిత్రమండలి సభ్యులు మాత్రం చాలా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళను ప్రత్యేకంగా ఆడియో ఫంక్షన్ కు ఆహ్వానించాను’ అంటూ ట్వీట్స్ చేశారు. ఇది ఇలా ఉండగా మీడియాతో మాట్లాడిన వంగవీటి రాధాకృష్ణ మాత్రం సినిమా గనుక అభ్యంతరకరంగా ఉంటే అంగీకరించేదే లేదని అన్నారు. వర్మ, రాధా ఇద్దరు వెనక్కి తగ్గేవారు కాదని.. అభ్యంతరకర సన్నివేశాల్లో మాత్రం వర్మ నిర్ణయం తీసుకోవాలని కొడాలి నాని అన్నారు.