HomeTelugu Trendingబిగ్‌బాస్‌ విన్నర్‌ అతడే.. అతడికే ఓటేయండి అంటూ.. రవి ప్రచారం

బిగ్‌బాస్‌ విన్నర్‌ అతడే.. అతడికే ఓటేయండి అంటూ.. రవి ప్రచారం

anchor ravi
తెలుగు బిగ్‌బాస్‌-5.. 19 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభమైన ప్రయాణంలో ఐదుగురు మాత్రమే మిగిలారు. వీళ్ల గురి ఇప్పుడు టైటిల్‌ మీదే ఉంది. వీరు లక్ష్యాన్ని చేరుకోవడానికి అటు ప్రేక్షకులు మాత్రమే కాదు, ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లు కూడా సాయం చేస్తున్నారు. ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లు వారికి నచ్చిన ఫైనలిస్టుల్లో ఒకరికి ఓట్లేయమంటూ ప్రచారం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా యాంకర్‌ రవి సింగర్‌ శ్రీరామ్‌ కోసం రంగంలోకి దిగాడు. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న 5 డిజర్వింగ్‌ అంటూనే ఆ టైటిల్‌ మాత్రం శ్రీరామ్‌కే దక్కాలంటూ ప్రచారం మొదలు పెట్టాడు.

anchor ravi1

అందులో భాగంగా ఆటోను సైతం నడిపాడు. ‘అన్నపూర్ణ స్టూడియో హౌస్‌, బిగ్‌బాస్‌ హౌస్‌.. బిగ్‌బాస్‌ హౌస్‌..’ అని అరుస్తూ ఆటోవాలాగా మారిపోయాడు. ‘బిగ్‌బాస్‌ సీజన్‌ 5 గెలిచేది ఒకే ఒక్కరు.. అది శ్రీరామచంద్ర మాత్రమే.. అతడికే ఓటేయండి’ అంటూ ఆటో నడిపాడు. ఈ ఆటో వెనకాల శ్రీరామ్‌ను గెలిపించాలంటూ పోస్టర్‌ కూడా ఉంది. ఇక ఈ వినూత్న ప్రచారం చూసి అభిమానులు యాంకర్‌ రవిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘నువ్వు లోపలుండి ఆడు, నీకోసం నేను బయటనుంచి ఆడతా’ అన్న మాటను రవి నిజం చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు.

https://www.instagram.com/reel/CXbE25wlAg8/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu