HomeTelugu Trendingబిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలేలో తారల సందడి

బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలేలో తారల సందడి

Tollywood stars in Bigg bos

తెలుగు బిగ్‌బాస్- 4 రియాలిటీ షో ఈరోజుతో ముగియనుంది. కాసేపట్లో బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ప్రారంభం కానుంది. ఇంట్లో మిగిలిన ఐదుగురి సభ్యుల్లో ఎవరు టైటిల్ విన్‌ అవుతారో అని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇక విజేతను ప్రకటించేందుకు బిగ్‌బాస్ నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఫినాలే కార్యక్రమాన్ని అంగంరంగ వైభవంగా జరగనుంది. తెలుగు సినీ తారలు ఈ కార్యక్రమానికి అతిథులుగా తరలివచ్చి.. స్టేజిపై ఆటపాటలతో సందడి చేశారు. దానికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా ఇప్పటికే విడుదల చేసింది. బిగ్ బాస్ స్టేజిపై మ్యూజిక్ డైరెక్టర్ కన్సర్ట్ ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతోంది. ఇక యంగ్‌ డైరెక్టర్‌ అనిల్ రావిపూడి, హీరోయిన్ మెహ్రీన్ బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లారు. ఇంటి సభ్యులను అనుకరిస్తూ అనిల్ రావిపూడి నవ్వులు పూయించారు. ఇక ”లవ్ స్టోరీ” మూవీ జంట.. నాగ చైతన్య, సాయిపల్లవి కూడా స్పెషల్ గెస్ట్‌లుగా వస్తారని సమాచారం. చివరగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నారు. బిగ్ బాస్ టైటిల్ విన్నర్‌కు తన చేతుల మీదుగా ట్రోఫీతో పాటు క్యాష్ అందించనున్నారు.

‘బిగ్‌బాస్-4’ కంటెస్టెంట్‌లు అందరూ ఈ కార్యక్రమానికి హాజరై ఆట పాటలతో అదరగొట్టారు. ఒక్క దేవి నాగవల్లి మాత్రం కనిపించలేదు. అటు టాప్-5 కంటెస్టంట్స్ కుటుంబ సభ్యులు కూడా ఫినాలే కార్యక్రమానికి హాజరయ్యారు. బిగ్ బాస్ సీజన్ 1, 2, 3 విన్నర్‌లను కూడా కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం అభిజీత్, అఖిల్, సోహెల్, అరియానా, హారిక టాప్-5లో ఉన్నారు. వీరిలో ఒకరు టైటిల్ విజేతగా నిలుస్తారు. ఇప్పటికే ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. అనధికారిక పోలింగ్ ప్రకారం.. అభిజీత్ టైటిల్ గెలిచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విన్నర్ ఎవరో తెలియాలంటే తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu