HomeTelugu Trendingబిగ్‌బాస్‌ భాను కొత్త సినిమా 'కలశ'

బిగ్‌బాస్‌ భాను కొత్త సినిమా ‘కలశ’

Bigg boss bhanusri new movi
తెలుగు బిగ్‌బాస్-2 కంటెస్టెంట్‌గా భానుశ్రీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఆ తరువాత భానుశ్రీ కాట‌మ‌రాయుడు, కుమారి 21ఎఫ్‌తో పాటు తెలుగులో ప‌లు సినిమాలు చేసింది. తాజాగా మ‌రో డిఫ‌రెంట్ మూవీతో భానుశ్రీ ఈ నెల‌లోనే టాలీవుడ్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

భానుశ్రీ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన క‌ల‌శ మూవీ డిసెంబ‌ర్ 15న విడుదలౌతుంది. సైకో కిల్ల‌ర్ క‌థ‌తో హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు కొండా రాంబాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. సోనాక్షి వ‌ర్మ‌, అనురాగ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. క‌ల‌శ మూవీ ట్రైల‌ర్‌ను ఇటీవ‌ల డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని రిలీజ్ చేశాడు.

క‌ల‌శ న‌టిగా త‌న‌కు మంచి పేరు తీసుకొస్తుంద‌నే న‌మ్మ‌క‌ముంద‌ని భానుశ్రీ తెలిపింది. క‌ల‌శ అన్న‌ది సినిమాలోని ఓ క్యారెక్ట‌ర్‌. ఆ పాత్ర ఎవ‌రు చేశార‌న్న‌ది సినిమాలో స‌స్పెన్స్‌గా ఉంటుంద‌ని డైరెక్ట‌ర్ తెలిపాడు. సెన్సార్ స‌భ్యులు ఎలాంటి క‌ట్స్ లేకుండా స‌ర్టిఫికెట్ ఇచ్చార‌ని చెప్పాడు. క‌ల‌శ సినిమాలో రోషిణి, జీవా స‌మీర్ ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. ఈ సినిమాకు విజ‌య్ కురాకుల సంగీతాన్ని అందిస్తున్నాడు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu