HomeTelugu Trending'లాయర్‌ సాబ్‌'గా నందమూరి బాలకృష్ణ!

‘లాయర్‌ సాబ్‌’గా నందమూరి బాలకృష్ణ!

4 5
నందమూరి బాలకృష్ణ ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ల తరువాత స్లో అయ్యాడు. కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు డిజాస్టర్లు కావటంతో తదుపరి చిత్రాన్ని మొదలు పెట్టేందుకు చాలా సమయం తీసుకున్నాడు. ఇటీవల కేయస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమాను ప్రారంభించాడు బాలయ్య.

ఈ సినిమా తరువాత ఓ రీమేక్‌ సినిమాలో నటించే ఆలోచనలో బాలయ్య ఉన్నట్టుగా తెలుస్తోంది. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన పింక్‌ సినిమాను తమిళ్‌లో అజిత్‌ హీరోగా రీమేక్‌ చేశారు. ఇప్పుడు అదే సినిమాను తెలుగులో బాలయ్య హీరోగా, దిల్‌ రాజు నిర్మాణంలో రూపొందించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాకు లాయర్‌ సాబ్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్‌పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu