HomeTelugu Trendingగంగవ్వ ఇంటి గృహప్రవేశం.. వీడియో వైరల్‌

గంగవ్వ ఇంటి గృహప్రవేశం.. వీడియో వైరల్‌

bigg boss contestant gangav

యూట్యూబ్‌ స్టార్‌, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ గంగవ్వ తన చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకుంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లిలో నూతనంగా నిర్మించుకున్న ఇంట్లోకి గంగవ్వ గృహప్రవేశం చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా ‘మై విలేజ్‌ షో’తో య్యూట్యూబ్‌ స్టార్‌గా ఎదిగిన గంగవ్వ బిగ్‌బాస్‌ -4 మరింత గుర్తింపు తెచ్చుకుంది.

గంగవ్వ సొంతిల్లు క‌ట్టుకోవాల‌న్న ఆశ‌యంతో బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టింది. అయితే అనారోగ్య కార‌ణాల వ‌ల్ల అయిదో వారంలోనే హౌస్‌ నుంచి బయటకు వచ్చేసింది. అయినప్పటికీ ఆమె క‌ల క‌ల‌గానే మిగిలిపోకూడ‌ద‌న్న భావ‌న‌తో హీరో నాగార్జున గంగవ్వకు ఇల్లు క‌ట్టిస్తాన‌ని ఆ బాధ్య‌త‌ను త‌న భుజాన వేసుకున్నాడు. చెప్పినట్లుగానే ఆమెకు రూ.7లక్షల రూపాయలు సహాయం చేశాడు. బిగ్‌బాస్‌ షో ద్వారా రూ.11లక్షలు సమకూరడంతోపాటు మరో రూ.3లక్షల వరకు అప్పుచేసిన గంగవ్వ చివరకు తన సొంత గ్రామం లంబాడిపల్లిలో సొంతిల్లు కట్టించుకుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu