HomeTelugu Trending'నా పేరు సీత నేను గీసిందే గీత'.. అంటున్న కాజల్‌

‘నా పేరు సీత నేను గీసిందే గీత’.. అంటున్న కాజల్‌

1 9హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ టైటిల్‌ పాత్రలో నటించిన సినిమా ‘సీత’. తేజ దర్శకత్వం వహించారు. బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరో. శుక్రవారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఫైటింగ్‌, యాక్సిడెంట్‌ సన్నివేశాలతో ట్రైలర్‌ మొదలైంది. ‘నా పేరు సీత నేను గీసిందే గీత. ప్రాస బాగుంది కదా..’ అని కాజల్‌ చెప్పే డైలాగ్‌ విని.. ‘ఇది కంచుకే కంచులా ఉందిరా బాబూ..’ అంటూ తనికెళ్ల భరణి వణికిపోతూ అనడం నవ్వులు పూయిస్తోంది. ఇందులో రామ్‌ (బెల్లంకొండ శ్రీనివాస్‌) అమాయకపు యువకుడిగా నటించారు. అతన్ని సీతే (కాజల్‌) దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. సోనూ సూద్‌ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. ‘రావణాసురుడు సీతను ఎత్తుకెళ్లడం తప్పు కాదండి. రాముడి భార్యను ఎత్తుకెళ్లడం తప్పు’ అని ట్రైలర్‌ చివర్లో శ్రీనివాస్‌ చెబుతున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. ఇందులో మన్నారా చోప్రా మరో హీరోయిన్‌గా నటించారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు. మే 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu