HomeTelugu Trending'బిగ్‌బాస్‌' ఫేమ్‌ అఖిల్‌ హీరోగా సినిమా ప్రారంభం

‘బిగ్‌బాస్‌’ ఫేమ్‌ అఖిల్‌ హీరోగా సినిమా ప్రారంభం

Bigg Boss fame akhil first

తెలుగు బిగ్‌బాస్‌ ఫేమ్‌ అఖిల్ సార్ధక్, అనిక విక్రమన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఫస్ట్ టైమ్’. ఐ.హేమంత్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఉగాది సందర్భంగా ఈ సినిమా పూజ కార్యక్రమాలు హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. దర్శక, నిర్మాత ఐ.హేమంత్ మాట్లాడుతూ ”అఖిల్ ఈ సినిమా తరువాత పెద్ద హీరో అవుతాడు. హీరోయిన్ కోసం 1500 ప్రొఫైల్స్ చూసి అనికకు సెలెక్ట్ చేశాం. త్వరలో ఈ సినిమా షూట్ కొరకు కర్నాటకలోని అప్సర కొండ బీచ్ కు వెళుతున్నాం. అక్కడ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి అదే నెల చివరికంతా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేస్తాం. అన్నీ అనుకున్నట్లు జరిగితే వరల్డ్ లోనే ఫస్ట్ టైం న్యూ ఫార్మాట్ లో ప్రీ లుక్ టీజర్ ను రిలీజ్ చేస్తాం. ఇది పూర్తి రొమాంటిక్ అడ్వెంచరస్ మూవీ. ఈ సినిమాను ఆగస్ట్ కంతా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాం” అని అన్నారు. అఖిల్ మాట్లాడుతూ ”హేమంత్ ఈ స్టోరీ గత సంవత్సరం క్రితమే చెప్పాడు. నేను ఈ కథ విన్న తరువాత రెండు నిమిషాలు బ్లాంక్ అయ్యాను. ఎందుకంటే ఇది డిఫ్రెంట్ యూనిక్ స్టోరీ. నేను చాలా కథలు విన్నా, కానీ ఇలాంటి కథ మళ్ళీ దొరకదనే ఈ సినిమా చేస్తున్నాను” అని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu