HomeTelugu Trendingబుల్లి తెరపై కూడా కాస్టింగ్‌ కౌచ్‌.. బిగ్‌బాస్‌ రోహిణి సంచలన వ్యాఖ్యలు

బుల్లి తెరపై కూడా కాస్టింగ్‌ కౌచ్‌.. బిగ్‌బాస్‌ రోహిణి సంచలన వ్యాఖ్యలు

5 22తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్‌ నుండి ఎలిమినేట్‌ అయ్యి బయటకు వచ్చిన నటి రోహిణి.. బుల్లి తెరపై కనిపించాలన్నా కాస్టింగ్‌ కౌచ్‌ సినిమాలపై ఆసక్తితో వచ్చిన అమ్మాయిలను లోబర్చుకునేందుకు కొందరు నిర్మాతలు లేదా ప్రొడక్షన్‌ మేనేజర్‌లు కాస్టింగ్‌ కౌచ్‌ పేరుతో ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఇప్పటిది కాదు. ఎన్నో ఏళ్లుగా వస్తున్న పద్దతి అంటు కొందరు సిగ్గు లేకుండా ఈ విషయాన్ని గురించి చెబుతున్నారు. అత్యంత దారుణమైన ఈ పరిణామాలు కేవలం వెండి తెరకే పరిమితం కాకుండా బుల్లి తెరకు కూడా వ్యాపించిందని తాజాగాచెప్పుకొచ్చింది.

ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన నేను హైదరాబాద్‌ వచ్చి ఉద్యోగం చేశాను. ఆ తర్వాత కొన్ని రోజులకు నాకు ఆఫర్లు వచ్చాయి. ఆఫర్ల కోసం నేను ప్రయత్నించిన సమయంలో ఒక సీరియల్‌ ఆడిషన్స్‌ కోసం వెళ్లాను. ఆ సీరియల్‌ నిర్మాతలు నన్ను నిర్మొహమాటంగా నన్ను కమిట్‌మెంట్‌ అడిగారు. దాంతో నేను అక్కడ నుండి వెళ్లి వచ్చాను. ఆ తర్వాత రెండు మూడు చోట్ల కూడా అలాంటి అనుభవం ఎదురైంది. నటిగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత అలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు అంది. బుల్లి తెరపై కూడా అవకాశాలు దక్కించుకునేందుకు అడ్డమైన పనులు చేయాల్సి వస్తుందని రోహిణి ఆవేదన వ్యక్తం చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu