HomeTelugu Trendingబిగ్‌బాస్‌: టాప్‌-5 నుండి ఎలిమినేట్‌ అయిన తొలి కంటెస్టెంట్‌ సిరి

బిగ్‌బాస్‌: టాప్‌-5 నుండి ఎలిమినేట్‌ అయిన తొలి కంటెస్టెంట్‌ సిరి

Siri
బిగ్‌బాస్‌ స్టేజ్‌పై రాజమౌళి డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారం కాబోతున్న పరంపర వెబ్‌సిరీస్‌ను లాంచ్‌ చేశారు. ఇక ఈ సిరీస్‌ మేకర్స్‌ ఆర్కా మీడియా, నటులు జగపతి బాబు, నవీన్‌ స్టేజ్‌పైకి వచ్చారు. తరువాత పుష్ప టీమ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, దేవిశ్రీ ప్రసాద్‌, రష్మిక స్టేజ్‌పై సందడి చేశారు. అనంతరం రష్మిక, దేవిశ్రీ ఇద్దరూ హౌస్‌లోకి వెళ్లారు. టాప్‌-5 కంటెస్టెంట్‌లను పలు ప్రశ్నలు అడిగారు. ఐదుగురు కంటెస్టెంట్‌ల ఫొటోలతో ఉన్న డ్రోన్స్‌ వస్తాయని వాటిలో ఒకటి ఎగిరిపోతుందని ఆ డ్రోన్‌పై ఎవరి ఫొటో ఉంటే వారే హౌస్‌ నుంచి బయటకు వస్తారని తెలిపారు. అలా సిరి ఫొటో ఉన్న డ్రోన్‌ ఎగిరిపోగా, ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చింది.

అనంతరం వేదికపైకి వచ్చిన సిరి మాట్లాడుతూ.. ’19మంది కంటెస్టెంట్‌లలో ఒకరిగా వచ్చిన నేను టాప్‌-5లో నిలవడం సంతోషంగా ఉంది. బిగ్‌బాస్‌ జర్నీ చాలా బాగుంది. చాలాసార్లు ఎమోషనల్‌ అయ్యా. ఏదైనా హౌస్‌లో నాకు నచ్చినట్టు నేను ఉన్నా. నా దృష్టిలో సీజన్‌-5 విన్నర్‌(షణ్ముఖ్)ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 15వారాలు నన్ను భరించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు .మీరు లేనిదే నేను లేను’ అని భావోద్వేగానికి గురైంది. తరువాత హిట్‌ సాంగ్స్‌తో స్టేజ్‌పై సింగర్స్‌ సందడి చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu