HomeTelugu Trending'గుడ్‌ లక్‌ సఖి' ట్రైలర్‌

‘గుడ్‌ లక్‌ సఖి’ ట్రైలర్‌

Good Luck Sakhi Trailer

జాతీయ అవార్డు గ్రహీత మహానటి కీర్తి సురేష్ నటించిన తాజా చిత్రం ‘గుడ్ లక్ సఖి’. డైరెక్టర్ నగేష్ కుకునూర్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి హీరోగా నటించగా.. జగపతిబాబు ముఖ్య పాత్ర పోషించారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఎట్టకేలకు కీర్తి సినిమా విడుదలకు సిద్ధమయ్యింది.

”గుడ్ లక్ సఖి” మూవీ జనవరి 28న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ క్రమంలో తాజా థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఓ గ్రామీణ యువతి జాతీయ స్థాయి షూటర్ గా ఎలా మారిందనే కథాంశంతో ఈ సినిమా రూపొందిందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. స్పూర్తిదాయకమైన కంటెంట్ తో ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. కమర్షియల్ హంగులన్నీ మేళవించి దర్శకుడు నాగేష్ కుకునూర్ ఈ చిత్రాన్ని రూపొందించారని తెలుస్తోంది. దిల్ రాజ్ సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై సుధీర్ చంద్ర ఈ సినిమాని నిర్మించారు. శ్రావ్యా వర్మ దీనికి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu