HomeTelugu Trendingలక్కీ లక్ష్మణ్: టైటిల్‌ సాంగ్‌ విడుదల

లక్కీ లక్ష్మణ్: టైటిల్‌ సాంగ్‌ విడుదల

Bigg Boss Sohel Lucky Laksh
బిగ్ బాస్ ఫేమ్ సొహైల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. దత్తాత్రేయ మీడియా పతాకంపై రూపొందిస్తోన్న ఈ సినిమాకి ఏఆర్ అభి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హరిత గోగినేని నిర్మిస్తున్నారు. మోక్ష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా త్వరలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. చుట్టూ ఉన్న వారంతా నువ్వు లక్కీఫెలో అంటున్నా.. తాను మాత్రం ఎప్పటికీ అన్‌లక్కీఫెలోనే అని ఫీలయ్యే ఓ యువకుడి జీవితంలో జరిగిన అనేక ఆసక్తికర పరిణామాలతో పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాలోని ‘అదృష్టం చలో అందిరో చందమామ’ అంటూ సాగే టైటిల్ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ‘మజిలీ’, ‘ఖుషి’ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు శివ నిర్వాణ చేతుల మీదుగా సాంగ్ విడుదలయింది. భాస్కరభట్ల రచించిన ఈ సినిమాకి.. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. సింగర్ రామ్ మిరియాల పాటను ఆలపించారు. ఈ చిత్రంలో దేవి ప్రసాద్, రాజా రవీంద్ర, సమీర్, కాదంబరి కిరణ్, షాని సాల్మన్, అనురాగ్, అమీన్, శ్రీదేవి కుమార్, మాస్టర్ రోషన్, మాస్టర్ అయాన్, మాస్టర్ సమీర్, మాస్టర్ కార్తికేయ, ఝాన్సీ, రచ్చ రవి, జబర్దస్త్ కార్తిక్ , జబర్దస్త్ గీతు రాయల్ తదితరులు నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu