HomeTelugu Trendingబిగ్‌బాస్‌-4 డేట్ ప్రకటించేశారుగా

బిగ్‌బాస్‌-4 డేట్ ప్రకటించేశారుగా

Bigg Boss Telugu 4

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా సంచలన రియాల్టీ షో తెలుగు బిగ్‌బాస్-4 సీజన్ త్వరలో మొదలు కాబోతుంది. తాజాగా ఈ విషయాన్ని మా నిర్వాహకులు వెల్లడించారు. దీనికి సంబంధించి కొత్త టీజర్‌ను విడుదల చేశారు. ఈ సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్స్‌కు కరోనా పరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌లో ఉంచారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత హౌస్‌లోకి అనుమతిస్తారు. కరోనా కారణంగా ఈసారి హౌస్‌లో మరింత జాగ్రత్తలు తీసుకోనున్నారు. బిగ్‌బాస్ సీజన్‌ ఈసారి కుదించబోతున్నట్లు సమాచారం. ఈసారి హగ్‌ చేసుకోవడం, షేక్‌ హ్యాండ్ ఇచ్చుకోవడం వంటివి ఉండకపోవచ్చు. కరోనా కారణంగా భౌతిక దూరం పాటిస్తూ ఫన్నీ టాస్క్‌లతో ప్రేక్షకులను అలరించొచ్చు.

కాగా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లేవారి గురించి షో ప్రారంభమయ్యే వరకు ప్రకటించరనే సంగతి తెలిసిందే. అప్పటిలోగా మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తూనే ఉంటాయి. ప్రస్తుతం కూడా ఇలాగే పలువురి పేర్లు సోషల్ మీడియాలో ట్రెండ్అ వుతున్నాయి. రఘుమాస్టర్, ఆయన భార్య ప్రణవి, మహాతల్లి ఆమె భర్త సుశాంత్, జోర్దార్ వార్తలు చదివే సుజాత, కరాటే కల్యాణి, టిక్‌టాక్ స్టార్ అరియానా, యాంకర్ లాస్య షోలో పార్టిసిపేట్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నారు. అలాగే ప్రతిసారి జబర్దస్త్ నుంచి ఒకరిని తీసుకుంటున్నారు. ఈసారి అవినాష్ వస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు బిగ్‌బాస్‌-4 సీజన్ సెప్టెంబర్ 6వ తేదీ సాయంత్రం 6 గంటలకు స్టార్‌ మాలో ప్రారంభం కాబోతున్నట్లు ప్రకటిస్తూ టీజర్ విడుదల చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu