HomeTelugu Trendingబిగ్‌బాస్ తెలుగు 5వ సీజన్ త్వరలోనే

బిగ్‌బాస్ తెలుగు 5వ సీజన్ త్వరలోనే

Bigg Boss 5 telugu

బిగ్‌బాస్ రియాల్టీ షోకు అన్ని భాషల్లో మంచి ఆదరణ ఉంది. తెలుగులో ఇప్పటికే 4 సీజన్‌లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఐదో సీజన్‌కు రెడీ అవుతోంది. తెలుగు బిగ్‌బాస్ నాలుగో సీజన్ గతేడాది డిసెంబర్ 20న గ్రాండ్‌గా ముగిసింది. త్వరలోనే బిగ్‌బాస్ తెలుగు 5వ సీజన్ ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్‌ మధ్యలో షో ప్రారంభించనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే జులై నెలలో ప్రారంభించే అవకాశం ఉందంటున్నారు. ఈసారి షోలో కాస్త వెరైటీగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. బాగా పాపులర్ అయిన వారిని మాత్రమే తీసుకోబోతున్నారట. ఐదో సీజన్‌కు ఎవరు హోస్ట్‌గా వస్తున్నారనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ఈసారి కంటెస్టెంట్స్‌కు భారీగా ముట్టజెప్పనున్నట్టు తెలుస్తోంది. ఈసారి గ్లామర్ డోస్ ఎక్కువగా ఉండేట్లు ప్లాన్ చేస్తున్నారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu