HomeTelugu Trendingబిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్

బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్

Pallavi Prashantతెలుగు బిగ్‌బాస్ సీజన్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి సోదరుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన స్వగ్రామం కొల్లూరులో పల్లవి ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. బిగ్‌బాస్-7 టైటిల్ గెలుచుకున్న రోజు రాత్రి అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన అల్లర్ల కేసులో పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.

బిగ్‌బాస్ ఫైనల్స్‌ రోజు రాత్రి పల్లవి ప్రశాంత్‌కు స్వాగతం పలికేందుకు అతడి అభిమానులు పెద్ద ఎత్తున అన్నపూర్ణ స్టూడియోకు తరలివచ్చారు. అదే సమయంలో మరో కంటెస్టెంట్ అమర్‌దీప్ అభిమానులు కూడా అక్కడి చేరుకున్నారు. అప్పుడే ప్రశాంత్‌ అభిమానులకు అమర్‌దీప్ అభిమానులకు మధ్య ఘర్షణ జరిగింది.

అమర్‌దీప్‌, మరో కంటెస్టెంట్ అశ్విని కార్లపై రాళ్లు విసిరారు. కొందరు ఆర్టీసీ బస్సుల అద్దాలు పగలగొట్టారు. బందోబస్తుకు వచ్చిన పోలీసు బెటాలియన్ బస్సు అద్దాలనూ పగలగొట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా దాడులకు పల్లవి ప్రశాంత్ కారణమని తేలింది.

ఘర్షణ కేసులో పల్లవి ప్రశాంత్‌ను ఏ-1గా, అతడి సోదరుడు మనోహర్‌ను ఏ-2గా, ప్రశాంత్ స్నేహితుడిని ఏ-3గా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే కొందరిని అరెస్టు చేసిన పోలీసులు తాజాగా ప్రశాంత్ అతడి సోదరుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu