HomeTelugu Trendingవిజయ్‌ 'బిగిల్‌' చిత్రం అరుదైన రికార్డు..!

విజయ్‌ ‘బిగిల్‌’ చిత్రం అరుదైన రికార్డు..!

1 10
తమిళ హీరో విజయ్‌ నటించిన తాజా చిత్రం ‘బిగిల్‌’ అరుదైన రికార్డు సృష్టించింది. ఈ ఏడాది అత్యధికంగా ట్వీట్‌ చేసిన టాప్‌ టెన్‌ హ్యాష్‌ట్యాగ్‌లను ట్విటర్‌ ఇండియా విడుదల చేసింది. ఇందులో సినీ రంగం నుంచి (భారత్‌) కేవలం ‘బిగిల్‌’ మాత్రం చోటు దక్కించుకోవడం విశేషం. ఈ ఏడాది అత్యధికంగా హ్యష్‌ట్యాగ్‌లు పొందిన అంశాల్లో లోక్‌సభ ఎన్నికలు, చంద్రయాన్ 2, క్రికెట్‌ ప్రపంచకప్, పుల్వామా, ఆర్టికల్‌ 370, దీపావళి, అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌, అయోధ్య, ఈద్‌ముబారక్‌ వరుస క్రమంలో ఉన్నాయి. ‘బిగిల్‌’ ఆరో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో విజయ్‌ అభిమానులు సోషల్‌మీడియాలో సందడి చేస్తున్నారు. మరోసారి ‘బిగిల్‌’ హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్‌ చేస్తున్నారు. ఇందులో ఒక్క బాలీవుడ్‌ చిత్రం కూడా స్థానం దక్కించుకోలేకపోవడం గమనార్హం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu