HomeTelugu Trending'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' నుండి మరో సాంగ్‌ రీలీజ్‌

‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ నుండి మరో సాంగ్‌ రీలీజ్‌

6 25
క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ క్రాంతి కుమార్‌ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. ఈ చిత్రంలో రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేశ్‌, కేథరిన్‌, ఇజబెల్లా హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈసందర్భంగా బుధవారం ఈ చిత్రంలోని ‘బొగ్గు గనిలో.. రంగు మణిరా..’ లిరికల్‌ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం.

రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటకు గోపీ సుందర్‌ సంగీతం సమకూర్చారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌పై కె.ఏ.వల్లభ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, టీజర్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇందులో విజయ్‌ పాత్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu