HomeTelugu Trendingఇటలీకి 'రంగ్‌ దే' టీమ్‌!

ఇటలీకి ‘రంగ్‌ దే’ టీమ్‌!

Rang de shoot planned in
యంగ్‌ హీరో నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా షూటింగ్‌ లాక్‌డౌన్ కారణంగా ఆరు నెలల వాయిదా పడింది. ఇప్పుడు మళ్లీ ఈమధ్య ఈ చిత్రం షూటింగును ప్రారంభించారు. కొవిడ్ జాగ్రత్తలు తీసుకుని గత కొన్ని రోజులుగా ఈ చిత్రం షూటింగును హైదరాబాదులో కొనసాగిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ‘రంగ్ దే’ టీమ్ మూడు వారాల షెడ్యూల్ కోసం ఇటలీకి వెళ్లనుందని సమాచారం. దీని కోసం ప్రస్తుతం వీసా ఫార్మాలిటీలు చూస్తున్నారు. ఇటలీ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు రెండు పాటలు కూడా చిత్రీకరించనున్నారు. అందుకు అక్టోబర్ చివరి వారంలో ఇటలీ పయనమవుతారని తెలుస్తోంది..

Recent Articles English

Gallery

Recent Articles Telugu