HomeTelugu Trendingరవితేజ సినిమాలో బాలీవుడ్‌ ప్రముఖ నటుడు

రవితేజ సినిమాలో బాలీవుడ్‌ ప్రముఖ నటుడు

Bollywood actor anupam kher

రవితేజ హీరోగా తాజాగా చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’ ప్రస్తుతం థియేటర్స్ లో విడుదలైంది. ఆ తరువాత సినిమాగా ఆయన ‘ధమాకా ‘ చేస్తున్నాడు. నక్కిన త్రినాథరావు డైరెక్షన్‌లో వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగు దశలో ఉంది. శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్‌గా అలరించనుంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరువుకుంది.

ఆ తరువాత ప్రాజెక్టుగా రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాను చేస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే స్టూవర్టుపురం గజదొంగ జీవితకథ ఇది. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం నేష‌న‌ల్ అవార్డు గ్ర‌హిత అనుప‌మ్‌ఖేర్ నటిస్తున్నట్లు..మేక‌ర్స్ ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ‘కార్తికేయ 2’ సినిమాలో ఒక కీలకమైన పాత్రను చేసిన ఆయన, పెద్ద గ్యాప్ లేకుండానే మరో తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu